Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో మందుబాబుల కోసం 'ఓకే బాయ్స్ యాప్'

హైదరాబాద్ నగరంలో మందుబాబుల సేవల కోసం ఓ కుర్రోడు ఓకే బాయ్స్ పేరిట ఓ యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్‌ ద్వారా సమాచారం అందించే మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీన్ని ప్రారంభ

Advertiesment
హైదరాబాద్‌లో మందుబాబుల కోసం 'ఓకే బాయ్స్ యాప్'
, సోమవారం, 10 జులై 2017 (11:52 IST)
హైదరాబాద్ నగరంలో మందుబాబుల సేవల కోసం ఓ కుర్రోడు ఓకే బాయ్స్ పేరిట ఓ యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్‌ ద్వారా సమాచారం అందించే మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీన్ని ప్రారంభించగా, దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా విస్తరించనున్నారు. 
 
ఈ యాప్ సృష్టికర్త పోలాస రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ... గత యేడాది ఓ వ్యక్తి పీకల వరకు మద్యం సేవించిన ఓ మైనర్ గ్యాంగ్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన విషయం తెల్సిందే. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు వీలుగా యాప్‌ను తయారు చేసినట్టు చెప్పారు. అంటే ఈ యాప్ ప్రతి ఒక్కరికీ ప్రాణదాతగా నిలుస్తుందన్నారు. 
 
'ఓకే బాయ్స్ యాప్‌'ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని మద్యం సేవించిన వారు తమ సమాచారం, చిరునామా, ప్రస్తుతం ఉన్న చోటును పొందుపరిస్తే ఒక డ్రైవర్, సహాయకుడు ద్విచక్రవాహనంలో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుంటారన్నారు. అనంతరం డ్రైవర్ వెంటనే వాహన యజమానిని సురక్షితంగా ఇంటికి చేరుస్తాడు. 
 
ఇందుకోసం డ్రైవర్‌కు నామమాత్రంగా రూ.250, సహాయకుడికి రూ.100లు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. మద్యం సేవించి వాహనం నడుపకుండా ఇంటికి చేర్చటం వల్ల మందుబాబు తప్పిదాల వల్ల ఇతరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ యాప్‌ను తయారు చేసినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'డోకా లా'లో డ్రాగన్‌కు చెక్.. అవసరమైతే యుద్ధానికి సై అంటున్న భారత్