Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నారై జయరామ్‌పై విష ప్రయోగం? మేనకోడలు శిఖా చౌదరి హస్తం?!

Advertiesment
ఎన్నారై జయరామ్‌పై విష ప్రయోగం? మేనకోడలు శిఖా చౌదరి హస్తం?!
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (12:49 IST)
కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ఎన్నారై జయరామ్ అలియాస్ చిగురుపాటి జయరామ్‌పై విషయ ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహం నీలం రంగుకు మారడంతో ఖచ్చితంగా ఆయనపై విషయ ప్రయోగం జరిగివుంటుందని నిర్ధారణకు వచ్చారు. దీంతో మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు, ఆస్తి తగాదాల వల్లే ఆయన హత్యకు గురైవుంటారని తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన మేనకోడులు శిఖా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివశించే జయరామ్ మృతదేహం కృష్ణా జిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం గ్రామం శివారులో 65వ నెంబరు జాతీయరహదారి పక్కన లభ్యమైంది. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు వస్తుండగా ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఆయన కారు డ్రైవర్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడకు చెందిన జయరామ్.. భార్య పద్మజా ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. 
 
ఇదిలావుంటే, జయరామ్ తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. ఆ తర్వాత నుంచి కుటుంబంలో ఆస్తి గొడవలు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద విచారణ జరుపుతున్నార. ఈ కేసు దర్యాప్తులోభాగంగా, శనివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జయరామ్ ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లిపై అన్న అత్యాచారం.. ఆపై అబార్షన్.. ఎక్కడ?