Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు: సీఎం జగ‌న్‌

Advertiesment
No one cares
, బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:01 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల గురించి ప‌లువురు ప‌లు ర‌కాల చేస్తున్న విధానాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం వివ‌ర‌ణ ఇచ్చారు. అస‌లు విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరని తేల్చిచెప్పారు. బుధ‌వారం నాడు ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడారు.
 
టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు, ప్రతి విద్యార్థి భవిష్యత్ కోసం నేను ఆలోచిస్తా. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇది స‌రికాదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదు. అందుకే పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 
 
టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం. కోవిడ్ పైన పోరాటంలో కచ్చితంగా గెలుస్తాం. టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‍కే నష్టం. విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు. 
 
పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‍లో విద్యార్థులు నష్టపోతారని జ‌గ‌న్ తెలియ‌జేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబ కలహాలు.. కన్నబిడ్డను కడతేర్చిన తల్లి