Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10 లక్షలిస్తా నా భర్తను తెచ్చివ్వు... బొజ్జలకు షాక్, వైసిపి శవరాజకీయాలు... నారా లోకేష్‌

మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి టైం బాగున్నట్లు లేదు. మంత్రి పదవి పోగొట్టుకున్న తరువాత సైలెంట్‌గా ఉన్న బొజ్జల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే ఏర్పేడులో నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబీకులను పరామర్శించేందుకు నారా లోకేష్‌‌తో పాట

10 లక్షలిస్తా నా భర్తను తెచ్చివ్వు... బొజ్జలకు షాక్, వైసిపి శవరాజకీయాలు... నారా లోకేష్‌
, శనివారం, 22 ఏప్రియల్ 2017 (18:42 IST)
మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి టైం బాగున్నట్లు లేదు. మంత్రి పదవి పోగొట్టుకున్న తరువాత సైలెంట్‌గా ఉన్న బొజ్జల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే ఏర్పేడులో నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబీకులను పరామర్శించేందుకు నారా లోకేష్‌‌తో పాటు బొజ్జల మునగలపాళెంకు వెళ్ళారు. అయితే బొజ్జలకు అక్కడ తీవ్ర అవమానం జరిగింది. 
 
ఏడవద్దమ్మా.. ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాముగా ఏడవద్దమ్మా అంటూ బుజ్జగించపోయారు. ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకున్న మృతురాలి బంధువు నేను ఇంకో 5 లక్షల రూపాయలు వేసి 10 లక్షలు ఇస్తాను.. నా భర్తను బతికించు అంటూ కోపంతో ఊగిపోయింది. దీంతో బొజ్జల కొద్దిసేపు సైలెంట్ అయిపోయారు. ఏం చెప్పాలో తెలియక మౌనం పాటించారు.
 
వైసీపీ శవ రాజకీయాలు... లోకేష్
రోడ్డుప్రమాద ఘటనను కూడా వైసిపి శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి నారాలోకేష్‌. రోడ్డుప్రమాదం గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పిస్తే ప్రభుత్వం విఫలమైందంటూ వైసిపి నేతలు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు నారా లోకేష్‌. వై.ఎస్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం లక్షన్నర మాత్రమే నష్టపరిహారం ఇచ్చేవారని, అలాంటిది 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. 
 
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నారా లోకేష్‌ పరామర్శించారు. అలాగే మృతి చెందిన మునగలపాళెం గ్రామస్తుల వద్దకు వెళ్ళి వారి కుటుంబాలను పరామర్శించి నష్టపరిహారం అందజేశారు నారా లోకేష్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ తింటున్నాడు.. వేధింపులకు గురిచేస్తున్నాడు.. విడాకులిచ్చేయండి..