Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

తల్లిని ఓడించారన్న అక్కసుతో ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర : లోకేశ్

Advertiesment
Nara Lokesh
, శుక్రవారం, 31 జనవరి 2020 (16:22 IST)
ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. గతంలో విశాఖపట్టణం లోక్‌సభకు పోటీ చేసిన వైఎస్. విజయమ్మను విశాఖ ఓటర్లు ఓడించారన్న అక్కసుతోనే సీఎం జగన్ ఉత్తరాంధ్రపై దండ్రయాత్ర ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
 
ఇదే అంశంపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అభివృద్ధి, ప్రణాళిక లేకుండా 'ఉత్తరాంధ్ర అభివృద్ధి' అని జగన్ అన్నప్పుడే తనకు అనుమానం వచ్చిందని, ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైందని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు చూస్తుంటే జగన్ దండయాత్ర విషయమై స్పష్టత వచ్చేసిందంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.
 
అంతేకాకుండా, విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగనేనని, గతంలో తన తల్లిని ఎన్నికల్లో ఓడించారన్న ద్వేషంతో ఉత్తరాంధ్ర నడ్డివిరిచేలా జీఎన్ రావు కమిటీతో విషం కక్కారని మండిపడ్డారు. తుఫానులు వస్తాయని, ఉప్పునీరు చొచ్చుకుని వస్తుందని, భద్రత ఉండదని కుట్రపూరితంగా రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. 
 
ఇప్పుడీ చెత్త నివేదికతో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాకుండా చేశారని లోకేశ్ ట్విట్టర్‌లో నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రకు కంపెనీలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు రాకుండా చేసి జీఎన్ రావు కమిటీ రిపోర్టుతో దారుణంగా దెబ్బతీశారని జగన్‌పై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తున్న వుహాన్ నగరం.. వీధుల్లో శవాలు