‘అధికారులు, పాలకులు తప్పిదాలు వలనే రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారు. ప్రత్యమ్నాయం చూపకుండా నాయుడు, కరణాల వ్యవస్ధ రద్దు నుంచి రెవెన్యూ వ్యవస్ధ భ్రష్టు పట్టింది.
అమరావతి భూములు నాయకులకు, కార్పొరేట్ సంస్ధలకు కారుచవుకుగా ఇస్తే లేని తప్పు. పేదల ఇళ్ల కోసం కొంత కేటాయిస్తే తప్పా..?
రెవెన్యూ, రిజిష్ట్రేషన్ శాఖలలో సమన్మయ లోపం హక్కుదారులకు శాపంగా మారింది’ అని ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇళ్ల స్ధలాల పంపిణీపై కలెక్టరేట్‌లో మంత్రులు పిల్లి శుభాష్ చంద్రబోస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమీక్ష నిర్వహించారు.
ఇదే కార్యక్రమంలో మరో మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం డబ్బులు పండగలో బట్టల దుకాణాలకు వెళ్లిపోయిందన్నారు.
ఇళ్ల స్ధలాలు, ఇళ్ల నిర్మాణాలే శాశ్వతంగా నిలుస్తాయని.. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఇళ్ల నిర్మాణ చెల్లింపులు త్వరలో అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.