Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకు? మంత్రి కొడాలి

Advertiesment
Minister Kodali
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:07 IST)
తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు ఎప్పుడూ డిక్లరేషన్ గురించి మాట్లాడలేదని ఆయన అన్నారు. హిందు వాదులు, మతపెద్దలు అడగడం లేదని చంద్రబాబు మాత్రమే అడుగుతున్నారని అన్నారు.

చర్చికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు ప్రభువును నమ్ముతావా అని సంతకం అడగలేదన్న ఆయన డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనని ఆ విధానం తీసేయాలని ఆయన అన్నారు.
 
 సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్న ఆయన ఎక్కడలేని సంప్రదాయం తిరుమల లో మాత్రం ఎందుకు! దాన్ని తీసేయాలని అన్నారు.

జగన్ సర్కారు వచ్చినందునే ఇప్పుడు టెస్ట్ చెయ్యాలి బ్లడ్ తీయాలి అంటున్నారని, జగన్ ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగ లేదని మంత్రి నాని ప్రశ్నించారు.

సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా!? అని నాని ప్రశ్నించారు. నిజమైన హిందు వాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి అబ్యంతరాలు లేవని అయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద ఫిలింసిటీ