Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో లైట్‌మెట్రో?

తిరుమలలో లైట్‌మెట్రో?
, సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (08:18 IST)
తిరుమలలో మరో అధునాతన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ లైట్‌మెట్రో ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందన్న నూతన ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులు వస్తున్న తరుణంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా టీటీడీ ఈ తరహా ఆలోచన చేస్తోంది. ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన హైదరాబాద్‌ మెట్రోరైల్వే ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఈ దిశగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.

పెరుగుతున్న రద్దీని దృష్టిలోపెట్టుకుని రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదని టీటీడీ వివిధ రకాల ఆలోచనలు చేస్తోంది.

తిరుమల కొండకు మెట్రో రైలు ఏర్పాటు అంశాన్ని సుబ్బారెడ్డి లేవనెత్తగా కొండల్లో మెట్రో రైలు మార్గం సాధ్యం కాదని తేల్చిచేప్తూనే లైట్‌మెట్రో భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎన్వీఎస్‌ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిసింది. తిరుపతి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ నుంచి శ్రీవారిమెట్ల మీదుగా తిరుమలకు లైట్‌ మెట్రో సౌకర్యవంతంగా ఉంటుందనే చర్చ జరిగింది.

అలానే తిరుపతి విమానాశ్రయం నుంచి అమరరాజ సంస్థ మీదుగా పాపనాశనం ద్వారా తిరుమలకు కూడా లైట్‌మెట్రో మార్గం సులభతరంగా ఉంటుందని ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. లైట్‌ మెట్రో  ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులు