Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కబ్జాను అడ్డుకున్న మహిళ దుస్తులిప్పేశారు... విశాఖలో దారుణం...

విశాఖపట్టణంలోని పెందుర్తిలో దారుణం జరిగింది. తన భూమిని కబ్జా చేసిన వారిని ఎదుర్కొన్న మహిళపై భూ బకాసురులు విరుచుకపడ్డారు. ఆమెను వివస్త్ర చేసి కిందపడేసి ఈడ్చారు. కబ్జాను ప్రశ్నించిన ఓ దళిత మహిళను వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన స్థానికం

కబ్జాను అడ్డుకున్న మహిళ దుస్తులిప్పేశారు... విశాఖలో దారుణం...
, బుధవారం, 20 డిశెంబరు 2017 (19:29 IST)
విశాఖపట్టణంలోని పెందుర్తిలో దారుణం జరిగింది. తన భూమిని కబ్జా చేసిన వారిని ఎదుర్కొన్న మహిళపై భూ బకాసురులు విరుచుకపడ్డారు. ఆమెను వివస్త్ర చేసి కిందపడేసి ఈడ్చారు. కబ్జాను ప్రశ్నించిన ఓ దళిత మహిళను వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ప్రభుత్వ భూములు లేదా డాక్యుమెంట్లు లేని భూములు, వివాదంలో ఉన్న భూములు ఉంటే వాటిపై కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు బాధిత మహిళ కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ మహిళా మంత్రులు స్పందించట్లేదని మండిపడ్డారు. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా అంటూ చిత్తూరులో రోజా మాట్లాడుతూ.. మండిపడ్డారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వేరుగా మాట్లాడారు. పెందుర్తిలో మహిళపై జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటట్లు ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత మృతిపై మళ్లీ రసవత్తర చర్చ...