Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నొప్పించివుంటే క్షమించండి : లగడపాటి భీష్మ ప్రతిజ్ఞ

నొప్పించివుంటే క్షమించండి : లగడపాటి భీష్మ ప్రతిజ్ఞ
, శుక్రవారం, 24 మే 2019 (19:17 IST)
ఆంధ్రా అక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో సర్వేలు చేయబోనని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన వెల్లడించిన సర్వే ఫలితాలు అక్షర సత్యాలయ్యాయి. దీంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజల నాడిని తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానంటూ పేర్కొన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రజానాడిని పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలమైనందుకు, భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 
 
తన సర్వేల వల్ల ఎవరైనా, ఏ పార్టీ అయినా బాధపడి ఉన్నట్లయితే మన్నించగలరు అని విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్‌కు లగడపాటి రాజగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. 2014లో రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి 2019లో సర్వేల సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా, తనకు ఏ ఒక్క పార్టీతో అనుబంధం లేదని స్పష్టం చేశారు. పైగా, సర్వేలు చేయడం తనకు ఓ వ్యాపకం అని చెప్పారు. అందువల్ల పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నించానని, కానీ, గత రెండు సర్వేలు తప్పు అయినందువల్ల తాను ఇకపై సర్వేలు చేయబోనని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలి.. మాయావతి డిమాండ్