కృష్ణా పుష్కర యాత్రికులపై ఆంక్షల్లేవ్... ఏ ఘాట్‌లోనైనా స్నానం చేయవచ్చు!
కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికుల సౌకర్యాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పుణ్య స్నానాలను ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులు ఏ ఘాట్‌లోనైనా స్నానమాచరించేలా నిబంధనలు సడలించ
కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికుల సౌకర్యాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పుణ్య స్నానాలను ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులు ఏ ఘాట్‌లోనైనా స్నానమాచరించేలా నిబంధనలు సడలించారు. అందువల్ల విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 43 ఘాట్లలో భక్తులు తమకిష్టమైన చోట స్నానం చేయవచ్చు.
వీటిలో ఫెర్రి, పవిత్రసంగమం, భవానీ, పున్నమి, కృష్ణవేణి, దుర్గా, పద్మావతి, తదితర 22 ఎ ప్లస్ ఘాట్లు, ఒక ఏ ఘాట్ ఉన్నాయి. జూపూడి, చాగంటిపాడు, దేవరపల్లి వద్ద మూడు లోకల్ ఘాట్లు, దాములూరు, తుమ్మలపాలెం, సూరాయిపాలెం, గొల్లపూడి, యనమలకుదురు, చోడవరం, పెదపులిపాక, రొయ్యూరు, ఐనవోలు తదితర ప్రాంతాల్లో 17 సి ఘాట్లు ఉన్నాయి. అందువల్ల భక్తులు ఆందోళన చెందకుండా, తమకు అనుకూలమైన ఘాట్‌లో నింపాదిగా స్నానం చేయవచ్చని పుష్కర నిర్వహణాధికారులు సూచించారు.
అయితే, భక్తుల సౌకర్యార్థం పుష్కరాల సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్న అధికారులు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నారు. దీనిలో భాగంగానే నగరంలో పలు ప్రదేశాలను 'నో వెహికల్ జోన్'గా ప్రకటించారు. దీంతోపాటు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు ఓల్వో బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా ఎటువంటి వాహనాలను అనుమతించరు.