Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరువుకి కేరాఫ్ అడ్రస్.. బుద్ధా వెంకన్న

Advertiesment
Keraf's Address
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (08:05 IST)
"కరువుకి కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది నీ మొహం శకుని  మామా... సింగిల్ టెండర్ల వెనుక ఉన్న రహస్యం ప్రజలకు తెలిసిపోయింది అని పిచ్చిపట్టి మాట్లాడుతున్నావ్. వచ్చిన 120 రోజుల్లో 150 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్నారు" అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై నిప్పులు చెరిగారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

ఇంకా ఆయన ట్విట్టర్ లో "ఎగువ రాష్ట్రాల నుండి వరదనీరు వచ్చినా రాయలసీమ రైతాంగానికి నీరు ఇవ్వలేని తుగ్లక్  పాలనకి డైరెక్టర్ అయిన నువ్వా కరువు గురించి మాట్లాడేది? చంద్రబాబు పాలనలో 10 లక్షల పంట కుంటలు ఏర్పాటు చేసారు. 
 
వ్యవసాయరంగంలో  రెండంకెల వృద్ధి సాధించిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నువ్వు, మీ తుగ్లక్ శని పాదం రాష్ట్రంలో మోపిన నాటి నుండి అకాల వర్షాలతో పంటల నష్టం, రాయలసీమలో వర్షం లేక రైతులకు మిగిలింది చినుకు కోసం  ఆకాశం వైపు ఆశగా ఎదురుచూపులేగా శకుని మామా!! 
 
కూల్చడం ముంచడం తప్ప మీకు రైతు బాధలు తెలిసి ఏడిస్తే కదా !! దోంగ డబ్బుతో చెత్త పేపర్,చెత్త ఛానెల్ నడిపే నువ్వు  పత్రికా విలువలు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే, ప్రాణాలు తీసే ముసలి అయ్యో పాపం అని కన్నీరు కార్చినట్లుంది శకుని మామా ! 
 
మీ దొంగ పేపర్ పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకూ ఒక్క వార్త అయినా పత్రికా విలువలతో రాసారా? పాపం మీ తుగ్లక్ నడిపే దొంగ పేపర్ గురించి మాట్లాడకుండా నువ్వు సామ్నా,మురసోలి గురించి మాట్లాడుతున్నవ్ అంటేనే మీ పత్రికా విలువలు ఏంటో అర్ధమయ్యాయిలే శకుని మామా!
 
శకుని మామా నీకు దమ్ముంటే ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ,మద్యపాన నిషేధం అంటూనే వారి  ఇళ్ల మధ్యలో మద్య దుకాణాలు తెరిచి మోసం చేసిన నిన్ను,నీ తుగ్లక్ ముఖ్యమంత్రి  ని చెప్పుతో కొట్టడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. 
 
మీ పేపర్ లీక్ వల్ల మోసపోయిన నిరుద్యోగులు మిమ్మల్ని తన్నడానికి కూడా వెనుకాడరు. నీ  కార్యకర్తలకు గ్రామవాలంటీర్ అని పేరు పెట్టగానే వాళ్ళు సేవకులయిపోరు శకుని మామా. డెంగ్యూతో గ్రామవాలంటీర్లు చనిపోతున్నారు వారిని కాపాడుకో
 
ఆ తరువాత వారుచేసే ఘనకార్యాల గురించి మాట్లాడుకుందాం. శకుని  మామా లాంతర్ల బిజినెస్ మొదలు పెట్టేసావా ఏంటి?  రాష్ట్రంలో మీ తుగ్లక్ పాలన వచ్చిన తరువాత కొవ్వొతులు, లాంతర్లు, ఇన్వెరటర్లు, జనరేటర్ల వ్యాపారం సూపర్ గా ఉంది అట.

నువ్వు బొగ్గుతో విద్యుత్, జల విద్యుత్ అంటూ సొల్లుకొట్టక కరెంట్ ఎప్పుడొస్తుందో ప్రజలకు చెప్పు" అంటూ చెలరేగిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన్యంలో పోలీసుల తనిఖీలు.. అదుపులో అనుమానితులు