Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#కేసీఆర్,జగన్ భేటీ - రాజధాని విషయంలో జగన్‌కు కేసీఆర్ సలహా ఇస్తారా?

#కేసీఆర్,జగన్ భేటీ - రాజధాని విషయంలో జగన్‌కు కేసీఆర్ సలహా ఇస్తారా?
, సోమవారం, 13 జనవరి 2020 (11:28 IST)
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం భేటీ కానున్నారు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల వ్యవధిలోనే మూడు సార్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలపై చర్చ జరిగే అవకాశం వుంది.

గతంలో జరిగిన సమావేశాల్లో.. అధికారులు, మంత్రులు పాల్గొంటే... ఈసారి మాత్రం కేవలం ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 2020, జనవరి 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఈ సమావేశం జరుగబోతోంది.  
 
మూడున్నర నెలల తర్వాత ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు. కేసీఆర్‌, జగన్‌ సమావేశంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. సీఏఏకు వైసీపీ మద్దతు తెలిపినా... ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేంద్రం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ బిల్లుల్ని వ్యతిరేకించాలంటూ ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. 
 
ఈ వ్యవహారంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే గతంలో చర్చించిన నదుల అనుసంధానంతో పాటు ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే గోదావరి నంది నుంచి ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న జలాలను ఒడిసి పట్టుకోవాలని ఇరు ప్రభుత్వాలు భావించాయి. 
 
అందులో భాగంగా తెలంగాణలో ఒక రిజర్వాయిర్ ను నిర్మించాలని ఆలోచన చేశారు. అయితే ఈ ఆలోచనను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరమించుకున్నారు. తెలంగాణ తో సంబంధం లేకుండానే గోదావరి , కృష్ణా , పెన్నా నదులను అనుసంధానం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. గోదావరి జలాలపై కూడా ఈసారి చర్చ జరిగే ఛాన్లున్నట్లు తెలుస్తోంది. ఇంకా రాజధాని వ్యవహారంపై కేసీఆర్.. ఏపీ సీఎం జగన్‌కు మంచి సూచన ఇచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చి ఆకుకూరను ఇలా ఎవరైనా తింటారా..? వీడియో వైరల్