Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంద్రకీలాద్రీపై దేశీ శరన్నరాత్రులు.. భక్తుల సౌకర్యార్థం సరికొత్త ఏర్పాట్లు

Advertiesment
durga temple

ఠాగూర్

, సోమవారం, 22 సెప్టెంబరు 2025 (09:18 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందడి మొదలైంది. సోమవారం నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలి రోజున కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 
 
ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్య భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్యపూజల మందిరం, రెండో యాగశాలను కూడా వారు ప్రారంభిస్తారు.
 
ఈ యేడాది భక్తుల సౌకర్యానికి, భద్రతకు పెద్దపీట వేస్తూ అధికారులు పలు కీలక మార్పులుచేశారు. గతంలో గాయాలకు కారణమవుతున్న ఇనుప కంచెల స్థానంలో, ఈసారి సురక్షితమైన 'ఫ్రేమ్ మోడల్' క్యూలైన్లను ఏర్పాటుచేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు వచ్చేందుకు వీలుగా ప్రతి 50 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేటును అమర్చారు. 
 
ఆ ద్వారానికి ఎరుపు రంగు వేసి, ప్రత్యేక బోర్డులతో స్పష్టంగా గుర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నవరాత్రుల్లో రూ.500 ప్రత్యేక దర్శనం టికెట్ను రద్దు చేసి, కేవలం రూ.300, రూ.100, ఉచిత దర్శన క్యూలను మాత్రమే అందుబాటులో ఉంచారు.
 
భక్తుల రద్దీని లెక్కించేందుకు హెడ్ కౌంట్ కెమెరాలు, కొండ పరిసరాలను పర్యవేక్షించేందుకు 500 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు. ఇందుకోసం మోడల్ గెస్ట్ హౌస్‌లో, మహా మండపంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అమ్మవారి పూజలు, హోమాలను వీక్షించేందుకు భారీ ఎల్ ఈడీ స్క్రీన్లను అమర్చారు. దర్శనానికి పట్టే సమయం, క్యూలైన్ల ప్రస్తుత పరిస్థితి వంటి వివరాలను కూడా ఈ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. భక్తుల కోసం కనకదుర్గ నగర్‌లో 12 లడ్డూ ప్రసాదం కౌంటర్లు ఏర్పాటుచేయగా, వాటిలో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు కేటాయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కుటుంబం నుంచి దూరం చేసిన వారి అంతు చూస్తా : కె.కవిత