Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడుకుతో సహజీవనం చేస్తోందనీ.. పెట్రోల్ పోసి నిప్పంటించారు...

పెళ్లికాని తమ కొడుకుతో సహజీవనం చేస్తోందని ఆగ్రహించిన ఆ యువకుడి తల్లిదండ్రులు వివాహిత శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణం కాకినాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Advertiesment
కొడుకుతో సహజీవనం చేస్తోందనీ.. పెట్రోల్ పోసి నిప్పంటించారు...
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (12:52 IST)
పెళ్లికాని తమ కొడుకుతో సహజీవనం చేస్తోందని ఆగ్రహించిన ఆ యువకుడి తల్లిదండ్రులు వివాహిత శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణం కాకినాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
స్థానికుల సమాచారం మేరకు.. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల రావుల మల్లేశ్వరికి స్థానిక చొల్లంగికి చెందిన అప్పారావుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధల కారణంగా భర్తకు దూరమైన మల్లేశ్వరి తన మూడేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటోంది. అయితే మల్లీశ్వరి ఫంక్షన్లలో వంట సామగ్రి శుభ్రపరిచే పనులకు వెళుతూ జీవనం సాగించేంది. 
 
ఈ క్రమంలో వంట సామగ్రిని తరలించే ఆటో డ్రైవర్‌ కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట చినమార్కెట్‌ వీధికి చెందిన బొడ్డు గంగాద్రి అలియాస్‌ బాబీతో మల్లీశ్వరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిద్దరి మధ్య సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ గత ఆరు నెలలుగా కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలోని పూలమార్కెట్‌ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. 
 
అయితే, గత వారం రోజులుగా తన వద్దకు బాబీ రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులే తన ప్రియుడిని రానీయకుండా ఆపి ఉంటారని భావించింది. ఈ నేపథ్యంలో మల్లీశ్వరి సోమవారం తన తల్లి కుమారిని తీసుకుని రామారావుపేటలోని బాబి ఇంటికి వెళ్లింది. అక్కడ బాబి కనిపించకపోయేసరికి బాబిని తనతో పంపాలంటూ అతని తల్లిదండ్రులైన అమ్మాజీ, కామేశ్వరరావులను కోరింది.
 
పెళ్లి కావాల్సిన కుర్రాడిని నీతో పంపేందుకు ససేమిరా కుదరదని బాబి తల్లిదండ్రులు ఖరాఖండిగా మల్లీశ్వరితో చెప్పారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం బాబి తల్లిదండ్రులు కోపోద్రిక్తులై సమీపంలో బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను మలీశ్వరిపై పోసి నిప్పంటించారు. 
 
ఫలితంగా ఆమె దేహం కాలిపోతూ బాధితురాలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ కుప్పకూలిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... మల్లీశ్వరిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఓ యువతి ఎంత పనిచేసిందో తెలుసా?