Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఉద్యోగం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. పలువురిచే లైంగిక దాడి చేయించాడు..?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దుస్తుల కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లిన యువతిపై లైంగిక దాడి జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా.. ఆ యువతిపై ఏపీ ఆప్రో ఛైర్మన్

Advertiesment
Kadapa
, సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (13:04 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దుస్తుల కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లిన యువతిపై లైంగిక దాడి జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా.. ఆ యువతిపై ఏపీ ఆప్రో ఛైర్మన్ శ్రీనివాస్ తండ్రి రామకృష్ణ (65) పలువురి వద్దకు పంపి వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కడపజిల్లాకు చెందిన సదరు యువతి తల్లిదండ్రులు మరణించడంతో.. ఐదు నెలల నుంచి కడపలోనే లేడీస్ హాస్టల్‌లో వుంటూ ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, ఖాజీపేటకు చెందిన సీఆర్ పాషా, ఖదీరుల్లాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు ఆప్కో చైర్మన్‌ గుజ్జల శ్రీనివాస్ తండ్రి గుజ్జల రామకృష్ణతో చెప్పి దుస్తుల కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని, ఆయన వద్దకు తీసుకెళ్లారని తెలిపింది.
 
ఆ సమయంలో మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి కుట్టుమిషన్‌ ఇప్పిస్తానని, అలాగే తన కుమారుడు చైర్మన్‌‌గా ఉన్న ఆప్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని రామకృష్ణ హామీ ఇచ్చారని తెలిపింది. పెద్దాయన మంచి చేస్తున్నారని నమ్మిన తనను, మాయమాటలు చెప్పి, ఒక ఇంట్లోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడని బాధితురాలు కంట తడిపెట్టుకుంది. 
 
ఎంత వేడుకున్నా ఆ కామాంధుడు పట్టించుకోలేదని.. బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాకుండా రహస్యంగా వీడియో తీశానని.. నగ్న వీడియోలను యూట్యూబ్‌లో పెడతానని బెదిరించి.. అనేక సార్లు తనను అనుభవించాడని.. పలువురి వద్దకు తనను పంపాడని బాధితురాలు వాపోయింది. 
 
ఆ వేధింపులను భరించలేక ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డానని.. కాని తెగించి ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చానని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికారంలో వున్న వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని... తనలా ఇంకో యువతి బలికాకూడదని.. అందుకే మీడియాతో తన గోడు వినిపించుకున్నానని బాధితురాలు తెలిపింది. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ప్రతినిధులకు ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం....