ఉక్రెయిన్ దేశంపై దండయాత్ర చేపట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ శాంతి ప్రబోధకుడు కేఏ.పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుతిన్‌కు 69 యేళ్ళ వయసులో పిచ్చిపట్టిందని ఆరోపించారు. మెటల్ పుతిన్ సర్వనాశనం చేస్తాడన్న విషయం తనకు ముందే తెలుసన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయకుండా తాను చాలా రోజు నుంచి కృషి చేస్తున్నానని, గత 21 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నానని ఆయన వెల్లడించారు.
నిజానికి ఉక్రెయిన్‌కు బలగాలను పంపాలని గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు చెప్పానని అపుడు ఆయన సమ్మతించి ఇపుడు వెనుకంజ వేశారని ఆరోపించారు. కళ్లు నెత్తికెక్కిన బైడెన్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణలను తాను కోరినప్పటికీ వారు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రపంచ శాంతిని కోరుకుంటానన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.