Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలల సంక్షేమ కమిటీల‌కు జువెనైల్ చట్టాలపై అవగాహ‌న స‌ద‌స్సు

Advertiesment
juvenile welfare
విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (16:20 IST)
చిన్నారుల హక్కులపై బాల నేరస్ధుల న్యాయ సంస్ధ, బాలల సంక్షేమ సంఘం సభ్యులు పూర్తి స్ధాయి అవగాహన కలిగి ఉండాల‌ని రాష్ట్ర వీధి బాలలు, బాల నేరస్తుల సంక్షేమం, దిద్దుబాటు సేవల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.  చట్టాలపై పూర్తి పరిజ్ఞానం సాధించగలిగినప్పుడు మాత్రమే పిల్లలకు తగిన న్యాయం చేయగలుగుతారని వివరించారు. కొత్త‌గా నియమితులైన బాల నేరస్ధుల న్యాయ సంస్ధ, బాలల సంక్షేమ సంఘం అధ్యక్షులు, సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూనిసెప్ సంయిక్త భాగస్వామ్యంతో విజయవాడ హరిత బెరంపార్కు వేదికగా నాలుగు రోజల శిక్షణా తరగతులను సోమవారం ప్రారంభించారు. 

 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కృతికా శుక్లా మాట్లాడుతూ, బాలల సంక్షేమంపై ముఖ్యమంత్రి  ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆ క్రమంలోనే 13 జిల్లాలకు సంబంధించి ఈ కమిటీల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేసామని వివరించారు.  బాలల సంక్షేమ కమిటీలో ఒక చైర్‌పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారని, జువెనైల్ జస్టిస్ బోర్డులో ఒక ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఇద్దరు సంఘ సేవకులు సభ్యులు ఉంటారన్నారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం కమిటీలు, అయా బోర్డుల అధ్యక్షులు, సభ్యులకు తప్పనిసరిగా పునశ్చరణను అందించవలసి ఉందన్నారు.

 
నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమంలో బాలల సంబంధిత చట్టాలతో పాటు జువెనైల్ జస్టిస్ చట్టం కింద వారు పోషించవలసిన భూమిక, బాధ్యతలపై శిక్షణ పొందుతారని డాక్టర్ శుక్లా పేర్కొన్నారు. అయా రంగాలకు చెందిన ప్రముఖులతో వీరికి శిక్షణ అందిస్తున్నామన్నారు. శిక్షణా తరగతులకు  దాదాపు 85 మంది సభ్యులు హజరుకాగా గురువారం వరకు కార్యక్రమం జరగనుంది. సమావేశంలో యానిసెఫ్ ప్రతినిధి డేవిడ్, శాఖ సంయిక్త కార్యదర్శి ప్రసాద్, పూజ తదితరుల పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్ (బి.1.1.529) వేరియంట్ లక్షణాలేంటి?