జిందాల్ ప్లాంట్ 2016లో ప్రారంభించి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలన్నారని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
వచ్చె నెలలో ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రభుత్వమే యూనిట్ రూ.6.18 కొనుగోలు చేస్తామని చెప్పారు.
పొల్యూషన్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని... చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోని చెత్తను ఈ ప్లాంట్‌కి తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
ఈ ప్లాంట్‌కి నీటి సమస్య ఉందని..ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్పోరేషన్ పరిధిలో యుజిడి వర్క్స్ పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.