Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శతకోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడని వదిలేసేవాడ్ని : నాగబాబు వ్యంగ్యాస్త్రాలు

Advertiesment
Naga Babu
, ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (16:25 IST)
మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆడిటర్స్ కాకపోయివుంటే శతకోటి గొట్టంగాళ్ళలో ఒక గొట్టంగాడని వదిలేసేవాడ్ని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు తన ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
 
అంతకుముందు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబులను లక్ష్యంగా చేసుకుని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చిరంజీవిగారి తమ్ముళ్లు కాకపోయివుంటే కుక్కలు కూడా మొరిగేవి కావంటూ వ్యాఖ్యానించారు. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందని, సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేసిన వాళ్లకు రాజకీయాలెందుకు? అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. దీనికి నాగబాబు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాము సాధారణమైన వ్యక్తులం అని, తాము సినిమాలు, టీవీ షోలు చేయకపోతే కుటుంబాలను పోషించుకోలేమని తెలిపారు.
 
'అయినా మీకు ఆ అవసరం లేదు లెండి, మంది సొమ్ము బాగా మెక్కారు కదా. ఇంకో 1000 ఏళ్లు కాలుమీద కాలువేసుకుని హాయిగా దొంగ లెక్కలు వేసుకుంటూ బతికగలరని మాకు తెలుసు. అవార్డులు అందుకోగల పారిశ్రామికవేత్తలను జైలు పాలుచేసింది తమరి ప్రతిభే కదా. మీరు వైఎస్సార్ ఆడిటర్ కాకపోయి ఉంటే శతకోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడని వదిలేసేవాడ్ని. ఈ కరోనా టైమ్‌లో నీలాంటి గొట్టంగాళ్లు నాతో ట్వీట్ చేసే బదులు, భవిష్యత్తులో ఏ జైల్లో ఎలా టైమ్ పాస్ చేయాలో ఇప్పటినుంచే ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి... టైమ్ కలిసొస్తుంది' అంటూ ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్లపైకి రావొద్దని చెప్పినందుకు ఏఎస్ఐ చేతి నరికేశారు...