కేఈకి జగన్మోహన్ రెడ్డి చెక్.. పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణగిరిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ మేరకు పత్తికొండ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున కంగాటి శ్రీదేవిని బరిలోకి ది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణగిరిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ మేరకు పత్తికొండ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున కంగాటి శ్రీదేవిని బరిలోకి దించనున్నట్లు ప్రకటించారు. శ్రీదేవిని మెజారిటీలో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు. దివంగత నేత నారాయణ రెడ్డిని గుర్తు చేసుకుంటున్న జగన్ రెడ్డి.. ఆయన సతీమణినే పత్తికొండ నుంచి బరిలోకి దించనున్నట్లు ప్రకటించడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు ప్రభాకర్‌లకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతోనే జగన్.. ముందుగానే తమ పార్టీ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో శ్రీదేవి భర్త కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ, ఏడాది క్రితం ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే నారాయణ కుటుంబంలో ధైర్యం నింపేందుకు శ్రీదేవిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని తెలుస్తోంది.
ఇక జగన్ పాదయాత్ర 16 కిలోమీటర్లు సాగింది. కృష్ణగిరిలో స్థానిక సమస్యలపై జగన్ ఈ సందర్భంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా, జగన్ ప్రజాసంకల్ప యాత్ర, 18వ రోజు షెడ్యూల్‌లో భాగంగా ఆదివారం రామకృష్ణాపురం నుంచి వెంకటగిరి వరకూ జగన్ పాదయాత్ర చేస్తారు.