Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీస్ స్టేషన్ లోనే ఎంపిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరం: చంద్రబాబునాయుడు

పోలీస్ స్టేషన్ లోనే ఎంపిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరం: చంద్రబాబునాయుడు
, శనివారం, 15 మే 2021 (20:40 IST)
అక్రమ కేసులో  పోలీసులు అదుపులోకి తీసుకున్న లోక్ సభ ఎంపి రఘురామకృష్ణంరాజును గాయాలయ్యేలా కొట్టడం పోలీసుల దమన కాండకు నిదర్శనం అన్నారు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన మాట్లాడుతూ...  అదుపులోకి తీసుకున్న గౌరవ ఎంపిని పోలీసులు ఏవిధంగా శారీరక హింసకు గురిచేస్తారు? అతను నేరస్తుడు కాదు  ప్రభుత్వ  అక్రమ కేసులొ  నిందితుడు మాత్రమే. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగుంపులుగా వెళ్లి అరెస్టు చేయడమే పెద్ద నేరం. ఇప్పుడు థర్డ్ డిగ్రీ అమలుచేయడం మరో తప్పు. రాష్ట్రంలో ఏ రకమైన రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు?
 
పోలీసు కస్టడీలో ఉన్న సామాన్య పౌరుడిని కూడా కొట్టే హక్కు పోలీసులకు ఉండదని చట్టం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చట్టం నుంచి ఏమైనా మినహాయింపు ఉందా? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికి  హింసించడం కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు యావత్ పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చగా మారింది.
 
ఈ చర్యలన్నీ ఫ్యాక్షన్ వ్యవస్థను తలపిస్తున్నాయి తప్ప రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నట్లుగా లేదు. ఎంపి స్థాయిలో ఉన్న వ్యక్తిపైనే పోలీసులు ఈవిధంగా జులుం ప్రదర్శించారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి జమానాలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరికొత్త చట్టాలను అమలుచేస్తున్నట్లు కన్పిస్తోంధి. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకంగా సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లోనే థర్డ్ డిగ్రీ అమలుచేయడంపై సమగ్ర విచారణ జరపాలి. ఇందుకు బాధ్యులైన సిబిసిఐడి ఉన్నతాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
 
సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా థర్డ్ డిగ్రీ అమలుచేయడం అనాగరికం. తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసుస్టేషన్లోనే హింసించాలని ఏ చట్టం చెబుతోంది. రఘురామ నడవలేని పరిస్థితులో ఉన్నారంటే ఏవిధంగా ఆయనను హింసించారో అర్థమవుతుంది. పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించడం దారుణం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలి. తక్షణమే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలి అని డిమాండ్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఐడీ పోలీసులు నన్ను కొట్టారు: రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు