కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీలో తొలిసారి వినూత్నంగా డ్రోన్‌తో శానిటేషన్ చేస్తున్నారు. మొట్ట మొదటిసారిగా హైదరబాద్ గరుడా స్పెష్ ఏజెన్సీస్ ద్వారా డ్రోన్‌తో శానిటేషన్ కార్యక్రమాన్ని నగర పంచాయతీ చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి, కమిషనర్ జయరామ్ ప్రారంభించారు.
కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, ముందస్తు జాగ్రత్తలో భాగంగా నందిగామలో శానిటేషన్ ప్రారంభించారు. గాలిలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, టెక్నాలజీతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు.
డ్రోను ద్వారా నందిగామ పట్టణంలో ఉన్న 20 వార్డులలో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని చల్లించి శానిటేషన్ చేస్తున్నట్టు కమిషనర్ జైరాం తెలిపారు. తక్కువ సమయంలో నగరమంతా శానిటేషన్ చేయడానికి డ్రోన్ ఉపయోగపడుతుందన్నారు. డ్రోన్ వినియోగాన్ని నగర ప్రజలంతా వింతగా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ నాయకులు దేవేందర్ రెడ్డితోపాటు, పలువురు అధికారులు పర్వవేక్షిస్తున్నారు.