Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్-రజినీతో మాట్లాడుతున్నాం... దక్షిణాది ఉద్యమం జెండా రెపరెప... గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ పలుకు పలుకుకీ ఓ పవర్ వుంటుంది. ఆ పవర్‌కి పవర్ స్టార్ తోడైతే... స్టార్‌కి దక్షిణాది సూపర్ స్టార్ జతకూడితే... అదే దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక రాజకీయ ఉద్యమం అంటున్నారు సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) వ్యవస్థాపకుడు

Advertiesment
rajinikanth
, గురువారం, 29 జూన్ 2017 (21:03 IST)
ప్రజా గాయకుడు గద్దర్ పలుకు పలుకుకీ ఓ పవర్ వుంటుంది. ఆ పవర్‌కి పవర్ స్టార్ తోడైతే... స్టార్‌కి దక్షిణాది సూపర్ స్టార్ జతకూడితే... అదే దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక రాజకీయ ఉద్యమం అంటున్నారు సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) వ్యవస్థాపకుడు, ప్రజా గాయకుడు గద్దర్. 
 
ఇప్పటికే వారితో ఈ విషయం గురించి చర్చిస్తున్నట్లు వెల్లడించారాయన. గురువారం నాడు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... త్వరలో రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. తమ యొక్క విధివిధానాలను ఇరువురికీ తెలియజేశామనీ, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 
 
తమ ఉద్దేశం దక్షిణాది ఆత్మగౌరవ జెండాను రెపరెపలాడించడమేనన్నారు. అందుకే రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లను 'సికా'లోకి ఆహ్వానించదలచినట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పరిధిలో వున్న 200 పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని, అలా చేయడం ద్వారా 2019 ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా వుంటుందో మీరే వూహించుకోండి అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై నుంచి మీ బీమా ప్రీమియం పెరుగుతోంది... మోదీ GST, సౌదీలో ఫ్యామిలీ ట్యాక్స్