Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరక్కాయ పొడి స్కామ్‌ : మోసం చేయాలనే ఉద్దేశ్యంతోనే కంపెనీ...

కరక్కాయ పొడి స్కామ్‌లో విచారణ ముందుకుసాగే కొద్దీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం అమాయక ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఓ కంపెనీని ప్రారంభించినట్టు తేలింది.

కరక్కాయ పొడి స్కామ్‌ : మోసం చేయాలనే ఉద్దేశ్యంతోనే కంపెనీ...
, ఆదివారం, 5 ఆగస్టు 2018 (09:54 IST)
కరక్కాయ పొడి స్కామ్‌లో విచారణ ముందుకుసాగే కొద్దీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం అమాయక ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఓ కంపెనీని ప్రారంభించినట్టు తేలింది.
 
ఇటీవల హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్‌‌ప్రాసెసింగ్‌ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన విషయం తెలిసిందే. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భాగంగా, సైబరాబాద్ పోలీసులు ప్రధాన నిందితుడు మేనేజర్ మల్లికార్జున్‌‌తో పాటు మరో ఐదుగురు ఈ స్కాంలో ఉన్నారని తేల్చారు. వీరిని అరెస్టు చేసి, వీరివద్ద నుంచి రూ.41 లక్షలు, ల్యాప్‌‌టాప్, 11 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత అనుభముతోనే ఈ మోసం చేశారని తేల్చారు. ఫైన్‌మిత్ర ద్వారా రూ.45 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలిపారు. ఈ స్కాంలో మొత్తం 650 మంది కరక్కాయ బాధితులు  ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
మొత్తం 81 టన్నుల కరక్కాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేశారన్నారు. రూ.8,17,92,000 నగదును వినియోగదారుల నుంచి నిందితులు సేకరించారు. వ్యాపారం కంటే మోసం చేయాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం కంపెనీని స్థాపించిందని తెలిపారు. బాధితుల్లో 80 శాతం మహిళలే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ డేటింగ్ ‌యాప్‌తో కనెక్ట్‌ అయిపోండి...