Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Advertiesment
Chandrababu

ఐవీఆర్

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (19:31 IST)
రాయచోటిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి పైకి లేచి... అన్నమయ్య జిల్లాకు యూనివర్శిటీ ప్రకటించాలంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. కూర్చోమని చెప్పినా ఆ యువకుడు అలాగే నినాదాలు చేస్తుండటంతో... ఏయ్ కూర్చోవయ్యా కూర్చో, నువ్వు అరవగానే యూనివర్శిటీ ప్రకటించేయాలా? మనం మాట్లాడుకుంటుంటే చూడండి ఇలాంటి వారు వస్తుంటారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ ఇలాంటివారు ఇద్దరుముగ్గురు అడ్డు తగులుతూనే వుంటారు'' అని మండిపడ్డారు.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరే స్టార్స్: కేతిరెడ్డి కామెంట్స్
వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివుగా వుంటారు. అంతేకాదు మనసులో వున్న భావాలను నిర్భయంగా బైటపెట్టేస్తుంటారు. సొంత పార్టీకి చెందినవారిని విమర్శించినా ధైర్యంగానే చేస్తుంటారు. అలాగే పాలక పార్టీకి చెందిన నాయకులనైనా పొగడ్తలతో ముంచేస్తారు. దటీజ్ కేతిరెడ్డి.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరే స్టార్స్ వున్నారని అన్నారు. ఐతే బాలయ్య హిందూపురంలో గెలవడం ఓ లెక్క ప్రకారం జరుగుతుంది. ఆయనను గుడివాడలో నిలబడి గెలవమనండి, ఆయన వల్ల కాదు అంటూ చెప్పారు. అలాగే చిరంజీవి గారు కూడా హీరోగా చిత్రాలు చేయడంతో పాటు తిరుపతిలో గెలిచారు. ఆ తర్వాత పార్టీని నడపలేకపోయారు.
 
వాస్తవానికి హీరోలు, స్టార్స్ ఎంతమంది వున్నా ఏపీలో మాత్రం ఇద్దరే వున్నారు. వారిలో ఒకరు పొలిటికల్ స్టార్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే రెండోవారు సినీ స్టార్ పవన్ కల్యాణ్. వీళ్లిద్దరికీ ఏపీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఎక్కడ వీరు సభ పెట్టినా పిలవకుండానే 10 వేల మంది ప్రజలు వచ్చేస్తారు. మిగిలినారెవరైనా సరే అంతా మేనేజ్మెంట్ చేసుకోవాల్సిందేనంటూ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ