Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించాయి. ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు, రాయలసీమ, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఈదుర

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
, ఆదివారం, 15 అక్టోబరు 2017 (15:14 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించాయి. ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు, రాయలసీమ, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తాయని, భారీ వర్గాల కారణంగా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. 
 
అల్పపీడన ద్రోణి, క్యుములోనింబస్, ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై పరుచుకున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు వీటి ప్రభావం ఉంటుందని, ఆపై వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని, చలిగాలుల తీవ్రత పెరుగుతుందన్నారు.
 
ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంటుంది. మరోవైపు అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటి మునగడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.
 
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి... నీటిని కిందకు వదులుతున్నారు. ఇక కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 
 
2009 తర్వాత కోయిల్‌ సాగర్ జలాశయం గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం పోటెత్తింది. జూరాల, హంద్రీ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌తో స్నేహం కోరుకుంటున్న అమెరికా.. డొనాల్డ్ ట్రంప్