Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరులో భారీ వర్షాలు.. చిత్తడిగా జగన్ మేమంతా సిద్ధం ప్రాంగణం

Advertiesment
Rains

సెల్వి

, శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (22:16 IST)
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చెప్పిన చల్లని కబురు శుక్రవారం నిజమైంది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు కురిశాయి. ఏపీలోని  పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో శుక్రవారం అకాల వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు,మేడికొండతో పాటు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. 
 
ఈ క్రమంలో 13వ రోజు బస్సుయాత్రలో భాగంగా ఏటుకూరు వద్ద జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణం చేరుకున్నారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా వాన కురిసి.. ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలలో దేవత కనిపించింది.. నరబలి ఇవ్వాలని కోరింది.. అంతే హత్య?