Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెడ్ల రాజ్యం కావాలి.. మనోడినే గెలిపించుకుందాం : టీడీపీ నేత మోదుగుల

Advertiesment
రెడ్ల రాజ్యం కావాలి.. మనోడినే గెలిపించుకుందాం : టీడీపీ నేత మోదుగుల
, సోమవారం, 3 డిశెంబరు 2018 (12:35 IST)
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి.. గురజాలలో మనోడినే గెలిపించుకోండి.. టీడీపీలో నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆయన చేసిన వాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
2009 ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో ఆయన గుంటూరు పశ్చిమం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు పార్టీలో సముచిత స్థానం లభించలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 
 
'తెలుగుదేశం పార్టీలో నా పరిస్థితి ఘోరంగా ఉంది. రెడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ' తన సామాజికవర్గాన్ని మిళితం చేసి వ్యాఖ్యానించారు. అదేసమయంలో గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదు. పేదల సంక్షేమం కోసం ఆయన పని చేశారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర కార్యక్రమం ఆయన చలవే. అందుకే రాబోయే రోజుల్లో రెడ్లరాజ్య రావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని మోదుగుల వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాంపల్లి పొలిటికల్ వార్... నువ్వానేనా అంటున్న అభ్యర్థులు