తెలుగుదేశం పార్టీ సర్పంచ్ దారుణ హత్య... ఎవరు చంపించారు?
రాష్ట్ర రాజధాని కూతవేటుదూరంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అదీకూడా... సర్పంచ్ ఇంట్లోకి దూరిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇ
రాష్ట్ర రాజధాని కూతవేటుదూరంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అదీకూడా... సర్పంచ్ ఇంట్లోకి దూరిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఈ హత్య జరిగింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే...
గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని వేమవరం సర్పంచ్‌గా టీడీపీ నేత శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఈయన సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నారు. ఆసమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు శ్రీనివాసరావును నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీనివాసరావు హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.