Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరులో కరుడుగట్టిన గ్యాంగ్ రేప్ ముఠా అరెస్టు

Advertiesment
Guntur Edlapadu Police
, ఆదివారం, 9 జనవరి 2022 (10:16 IST)
గుంటూరు జిల్లాలో కరడు గట్టిన గ్యాంగ్ రేప్ ముఠాను యడ్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులంతా కర్నూలు జిల్లాలోని పాణ్యం ప్రాంతానికి చెందిన వారు. అందుకే వీరిని పాణ్యం గ్యాంగ్ రేప్ ముఠాగా పిలుస్తూ వచ్చారు. ఈ ముఠా కోసం ఏపీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో యడ్లపాడు పోలీసులకు చిక్కారు. 
 
కూలి పనుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అత్యాచారాలకు పాల్పడుతూ వచ్చారు. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లాలో మకాం వేసి అత్యాచారాలు, దోపిడీలకు పాల్పడుతూ, జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూవచ్చారు. 
 
ఈ నేపథ్యంలో మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లికి చెదిన ఓ జంటపై దాడిచేసిన ముఠా, భర్తను కట్టేసి అతని కళ్లెదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే, యడ్లపాడు పరిధిలో రెండు జంటలపై దాడిచేసి దోపిడీ చేశారు. 
 
మరో ఘటనపై ద్విచక్రవాహనంపై తన తల్లితో కలిసి వెళుతున్న యువకుడిని అడ్డగించి ముఠా సభ్యులు తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత తల్లిపై అత్యాచారం చేశారు. ఇలా వరుస ఘటనలతో అప్రమత్తమైన జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎస్పీ క్లూస్ టీమ్ విభాగాన్ని రంగంలోకి దించారు. 
 
ఈ ముఠా సభ్యుల వేలిముద్రల ఆధారంగా కర్నూలు జిల్లా పాణ్యం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరు కూలిపనుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఇప్పటివరకు దాదాపు 30కి పైగా అత్యాచారాలకు, దారిదోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ రంగంపై కన్నేసిన రిలయన్స్ - ముకేశ్ చేతికి న్యూయార్క్ హోటల్