Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచార దోషులకు 20 యేళ్ల జైలు

Advertiesment
jail
, బుధవారం, 9 ఆగస్టు 2023 (19:17 IST)
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో జరిగిన సామూహిక అత్యాచార కేసులో దోషులుగా తేలిన ముగ్గురు కామాంధులకు 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత యేడాది ఈ అత్యాచార కేసు జరిగింది. కూలి పనుల కోసం కొందరు వలస కార్మికులు వచ్చారు. వీరు రైల్వే స్టేషన్‌‍లో నిద్రిస్తుండగా, భర్తను కొట్టి, మహిళను ఫ్లాట్‌ఫాం చివరకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో బుధవారం తీర్పును వెలువడింది, దోషులుగా తేలిన వారికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ గుంటూరు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
కాగా, గత 2022 మే నెల ఒకటో తేదీన ఈ అత్యాచార ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిలపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. ఈ నిందితులు నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ కేసులో ఏ1, ఏ2లకు జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో మరో నిందితుడైన మైనర్ అయిన ఏ3 కేసు విచారణ తెనాలి పోక్సో కోర్టులో సాగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్‌లో మాత్రమే ఉగ్రవాదం ఎందుకు పెరుగుతోంది?- ఆప్ఘన్ కౌంటర్