Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుజరాత్ టూరిజం గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్: విశాఖపట్నం వాసులకు విభిన్న రుచులు పరిచయం

Advertiesment
Gujarati Food Festival

ఐవీఆర్

, మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (18:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరంగా గుర్తించబడిన విశాఖపట్నం లోని భోజన ప్రియులను ఆకట్టుకుంటూ గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌ గుజరాత్ టూరిజం నిర్వహించింది. ఈ ఫెస్టివల్‌లో ప్రామాణికమైన గుజరాతీ వంటకాలను నగర వాసులు ఆస్వాదించారు. హోటల్ నోవాటెల్ విశాఖపట్నం వరుణ్ బీచ్ వద్ద  నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ గుజరాత్ యొక్క మహోన్నత పాకశాస్త్ర వారసత్వంలోకి అతిథులను తీసుకువెళ్లింది. అసలైన గుజరాతీ వంటకాల రుచిని అందించింది. గుజరాతీ ఆహార సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో ఆకట్టుకునే ప్రదర్శనలతో హోటల్‌ను అలంకరించారు. 
 
మినీ హంద్వో, పత్రా, ఖాండ్వీ, ధోక్లా, ఖమాన్, ఫుల్‌వాడి, బటాటా వాడా, మెథినా గోటా వంటి సాంప్రదాయ గుజరాతీ స్నాక్స్‌ని అందించడంతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మెయిన్ కోర్సు, గుజరాత్ యొక్క పాకశాస్త్ర వైవిధ్యాన్ని ప్రదర్శించింది. అతిథులు కోబిజ్ నో సంభారో, సెవ్ తమేతను షాక్, లసానియా బతక, రింగన్ నో ఓలో, వాల్, మాగ్ నీ లచ్కో దాల్, భరేలీ దుంగలిను షాక్, గుజరాతీ కాధీ, రాజ్‌వాడీ కాధీ, భట్, ఫుల్కా రోటీ, బజ్రీ నో రోట్లో, వాఘారేలో రొట్లో, కచుంబార్, పాపడ్, మసాలా ఛష్, అథాను వంటి వంటకాలను ఆస్వాదించారు. 
 
అతిథులుకు చుర్మా నా లడు, లాప్సి, అంగూరి బాసుడి, రాజ్‌భోగ్ మాథో, దూధి నో హల్వో, సుఖ్దీ వంటి సాంప్రదాయ గుజరాతీ డెజర్ట్‌లను కూడా అందించారు. ఆకర్షణీయమైన వీడియోలు ప్రతి వంటకం యొక్క క్లిష్టమైన తయారీని ప్రదర్శించాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్‌కి విశాఖపట్నం లోని ఆహార ప్రియుల నుండి అపూర్వ ప్రశంసలు లభించాయి. సాంప్రదాయ గుజరాతీ వంటల ఆస్వాదన ఒక ప్రత్యేక అనుభవం, ప్రత్యేకించి గుజరాతీ కమ్యూనిటీ సభ్యులకు సాంప్రదాయ రుచులు జ్ఞాపకాలలోనికి తీసుకువెళ్ళింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి రెండో వారంలో వేసవికాలం ప్రారంభం.. ఐఎండీ