Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డోకిపర్రులో గోదా కళ్యాణం... మేఘా క‌ష్ణారెడ్డి, చిరంజీవి దంప‌తుల హాజ‌రు

డోకిపర్రులో గోదా కళ్యాణం... మేఘా క‌ష్ణారెడ్డి, చిరంజీవి దంప‌తుల హాజ‌రు
విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (14:08 IST)
కృష్ణా జిల్లా డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోదా కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి, సురేఖ దంపతులు కళ్యాణ వేదికపై ఆసీనులై  కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణంలో కృష్ణారెడ్డి దంపతుల కుటుంబ సభ్యులతో పాటు డోకిపర్రు గ్రామ ప్రజలు, సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని, కల్యాణాన్ని వీక్షించారు. 
 
 
మహాక్షేత్ర వేద పండితులు ఈ సందర్భంగా  గోదా కళ్యాణం విశిష్టతను వివరించారు. గోదా దేవి అంటే పుడమి నుంచి  జన్మించింది అని అర్ధమని, గోదా దేవి శ్రీ వెంకటేస్వరుని  మనువాడిన సందర్భాన్ని పురస్కరించుకుని  ధనుర్మాసంలో గోదా దేవి కల్యాణాన్ని నిర్వహిస్తారని తెలిపారు.  భూమాత అనుగ్రహం వాళ్ళ పంటలు సమృద్ధిగా పండిన సంతోషంతో  సంక్రాంతి పండుగను జరుపుకుంటారని తెలిపారు.  గోదాదేవి కళ్యాన్ని పురస్కరించుకుని మహాక్షేత్రాని వివిధ రకాల పుష్పాలు, విద్యుత్దీపాలతో అలంకరించారు.  కళ్యాణానికి ముందు మహాక్షేత్రంలో  స్నపనతిరుమంజనం , అభిషేకం, ఎదుర్కోళ్లు  నిర్వహించారు. ముందుగా చిరంజీవి దంపతులు భూ సమెత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించి ప్రసాదం అందచేశారు. 
 
డోకిపర్రు మహాక్షేత్రం డైరీ, క్యాలెండర్ ను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులతో కలిసి కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు  చిరంజీవి,  సురేఖ దంపతులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీ పీ రెడ్డి, రమారెడ్డి ,పీ వీ  సుబ్బారెడ్డి,సుమలత, పీ నాగిరెడ్డి, ప్రసన్న, పీ. వీరారెడ్డి, విజయలక్ష్మి, కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ తదితరులు పాల్గొన్నారు. 
 
 
డోకిపర్రు మహాక్షేత్రం లో భక్తుల సౌకర్యార్ధం అధునాతన కళ్యాణకట్టను శుక్రవారం సుధారెడ్డి, రమా రెడ్డి ప్రారంభించారు. డోకిపర్రు మహాక్షేత్రం సందర్శించి తలనీలాలు సమర్పించాలనుకునే భక్తులు ఈ కల్యాణకట్టలో తలనీలాలు ఇవ్వవచ్చ‌ని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి పురంధేశ్వ‌రి ఇంటికి బాల‌య్య‌... గుర్రం ఎక్కి...