విజయవాడలో కాపు సామాజిక వర్గంలో బలమైన యువ నేతగా ఉన్న దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నర్సాపురానికి చెందిన యువతిని ఈయన వివాహం చేసుకోనున్నారు. ఆమె పేరు పుష్పవల్లి. ఈమెతో వంగవీటి రాధ వివాహం నిశ్చమైనట్టు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధకు నర్సాపురం మాజీ మున్సిపల్ మాజీ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీల చిన్న కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్థం ఈ నెల 19వ తేదీన, వీరి వివాహం మాత్రం అక్టోబరు నెలలో జరుగనుంది. మరోవైపు, తమ అభిమాన నేత వంగవీటి రాధ నివాసంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తతో వంగవీటి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాము ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని అంటున్నారు. కాగా, వంగవీటి రాధ వివాహం రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.