Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ 'జనసేన'లోకి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి...?

గల్లా అరుణకుమారి. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. ఎందుకంటే గల్లా ఫుడ్స్, గల్లా బ్యాటర్యీస్ లాంటి కంపెనీలతో గల్లా కుటుంబం సుపరిచితమే. అందులోనూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మంత్రిగా ఈమె పనిచేశారు. దివంగ

పవన్ కళ్యాణ్ 'జనసేన'లోకి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి...?
, సోమవారం, 16 జనవరి 2017 (08:23 IST)
గల్లా అరుణకుమారి. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. ఎందుకంటే గల్లా ఫుడ్స్, గల్లా బ్యాటర్యీస్ లాంటి కంపెనీలతో గల్లా కుటుంబం సుపరిచితమే. అందులోనూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మంత్రిగా ఈమె పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితం వీరి కుటుంబం. గల్లా రామచంద్రనాయుడు నుంచి వారి ఇంట్లోని వారందరూ వై.ఎస్.కు దగ్గరి వారే. అయితే ఆయన మరణం తరువాత రాజకీయ పరిణామాలు మారడం... కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పోవడంతో గల్లా అరుణ తెలుగుదేశంపార్టీ పుచ్చుకున్నారు. అంతేకాదు తన కుమారుడు గల్లా జయదేవ్‌ను కూడా ఆ పార్టీలోనే చేర్పించారు. ప్రస్తుతం జయదేవ్ టిడిపి తరపున ఎంపిగా కూడా ఉన్నారు.
 
ఇదంతా బాగానే ఉన్నా గల్లా అరుణకుమారికి తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు, స్థానం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కేవలం పార్టీ నాయకురాలిగా మాత్రం ఉంటూ ఎక్కడా కూడా ఏ కార్యక్రమంలో ఆమె పాల్గొనడం లేదు. ముందు పార్టీలో చురుగ్గా ఉన్న గల్లా అరుణకుమారి.. కొంతమంది సీనియర్ నేతల కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. ఆ తర్వాత ఏకంగా పార్టీకే దూరమయ్యేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఆ పర్యటనకు వచ్చేవారు గల్లా అరుణకుమారి. అయితే గత మూడునెలలుగా ఆమె ఎక్కడా కూడా బయటకు రావడం లేదు. గల్లా సొంతం నియోజకవర్గం చంద్రగిరి. ఆమె ఇక్కడి నుంచే పోటీ చేసి గతంలో గెలుపొందారు.. ఆ  తర్వాత ఓడిపోయారు.
 
కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నా.. ఎక్కడా కనిపించరు. కనీసం సంక్రాంతి పండుగకైనా నారావారిపల్లికి వచ్చే చంద్రబాబునాయుడును గల్లా అరుణకుమారిని కలుస్తారని అందురు భావించారు. కానీ, అక్కడ కూడా ఆమె జాడే కనిపించలేదు. అంతేకాదు ఇందులో ఒక ట్విస్టు ఉంది. గల్లా అరుణకుమారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పవన్‌ కళ్యాణ్‌ ఉండటమే. గత కొన్నిరోజులుగా గల్లా అరుణకుమారి వేరే పార్టీలోకి వెళ్ళిపోతారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో సంక్రాంతి నాడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. అయితే గల్లా అరుణకుమారి జనసేనలో చేరుతారా.. లేకుంటే టిడిపిలో కొనసాగుతారా అన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ఇన్ఫోకామ్‌లోమరో 30 వేల కోట్లు కుమ్మరించనున్న ఆర్ఐఎల్