Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేణిగుంట: క్యాషియర్ మెడలో కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

robbery

సెల్వి

, గురువారం, 19 డిశెంబరు 2024 (10:21 IST)
robbery
రేణిగుంట బ్యాంకులో జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపతి రూరల్ మండలం రేణిగుంట రోడ్డులోని బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించాడు. 
 
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. మంగళవారం సాయంత్రం బ్యాంకు మూసివేసే సమయంలో ఓ యువకుడు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, బ్యాగ్‌లో కత్తి పెట్టుకుని బ్యాంక్‌కు వచ్చాడు.
 
క్యాషియర్ పక్కన ఉన్న అకౌంటెంట్ మెడపై కత్తిపెట్టి డబ్బులు బ్యాగ్‌లో వేయాలని బెదిరించాడు. అదే సమయంలో బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులు ఆ యువకుడిని మాటల్లో దింపి చాకచక్యంగా పట్టుకున్నారు. బయటకు తీసుకు వచ్చి.. గ్రిల్‌కు కట్టేసి చితకబాదారు. తాను రూ. 5 లక్షలు అప్పు చేశారని, ఆ బాధ తట్టుకోలేక చోరీకి వచ్చినట్లు నిందితుడు చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్