నల్లకుబేరుల పని.. రూ.500, రూ.1000 నోట్లు చించి రోడ్డుపై పారబోశారు..
రూ.500, 1000 నోట్లు రద్దు చేయడంతో నల్ల కుబేరులు హడలెత్తిపోతున్నారు. కోల్‌కతా గుర్తుతెలియని దుండగులు రూ.500, 1000 నోట్లు చించి రోడ్డపై పారబోశారు. గోల్ఫ్ క్లబ్ ఏరియాలో రెండు బస్తాల నోట్లు చించిపడేసి కని
రూ.500, 1000 నోట్లు రద్దు చేయడంతో నల్ల కుబేరులు హడలెత్తిపోతున్నారు. కోల్‌కతా గుర్తుతెలియని దుండగులు రూ.500, 1000 నోట్లు చించి రోడ్డపై పారబోశారు. గోల్ఫ్ క్లబ్ ఏరియాలో రెండు బస్తాల నోట్లు చించిపడేసి కనిపించాయి. ఈ నోట్లను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాత్రి ఎవరో ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. చించి పడేసిన ఈ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనతో భయపడిన కొందరు నల్లకుబేరులు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలా పారేసే బదులు తమకు ఇవ్వచ్చుకదా అని స్థానిక పేదవారు అంటున్నారు.
మరోవైపు జనం ఇంకా రెండు వేల రూపాయల అసలు నోటు కూడా చూడకముందే మార్కెట్లో నకిలీ 2000 నోట్లు హల్‌చల్ చేస్తున్నాయి. కర్ణాటక చిక్‌మగళూర్‌లో నకిలీ రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
కలర్ జిరాక్స్ ద్వారా ఈ నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు కొందరు యత్నించారు. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. రెండు వేల రూపాయలను కలర్ జిరాక్స్ చేసి చెలామణి చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.