కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గురువారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ నుండి దాదాపు మూడు లక్షల అరవై వేల డోసులు రాష్ట్రానికి వచ్చాయి. వ్యాక్సిన్లను గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్‌కు అధికారులు తరలించారు.
కేంద్రం ఆదేశాలతో వైద్య సామాగ్రి రాష్ట్రానికి చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ప్రత్యేక విమానంలో 50 ఆక్సిజన్ సిలెండర్లు, మరో 50 ప్రాణవాయువు సాంద్రత పరికరాలు వచ్చాయి. కరోనా రోగులకు అందించే అత్యవసర చికిత్సలకు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది.
ప్రాణవాయువు పరికరాలతో పాటు చేరుకున్న అత్యవసర వైద్య సామగ్రితో కొవిడ్ సేవల్లో పురోగతి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు వంద పైచినుకు వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను కేంద్రం పంపగా... తాజాగా అత్యవసర చికిత్సకు మరికొన్ని చేరాయి.