Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో 572కు చేరిన కరోనా కేసులు.. దేశంలో 452 మరణాలు

Advertiesment
ఏపీలో 572కు చేరిన కరోనా కేసులు.. దేశంలో 452 మరణాలు
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (21:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 572కు చేరింది. శుక్రవారం కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 572కు చేరాయి. ఇకపోతే, ఇప్పటివరకు మొత్తం 14 మంది చనిపోగా, మరో 35 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. 
 
572 మంది కరోనా పాజిటివ్ కేసుల్లో 523 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం గుంటూరులో నాలుగు కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలులో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు మూడో స్థానంలోనూ, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 
 
ఇకపోతే, దేశంలో కూడా మొత్తం కరోనా కేసుల సంఖ్య 13835కు చేరగా, ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 452కు చేరింది. ప్రస్తుతం దేశంలో 11,616 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1766 మంది కోలుకున్నట్టు తెలిపింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో 353 కరోనా పాజిటివ్ కేసులు, ఐనా నో ఫియర్, దేవెగౌడ మనవడి పెళ్లి