వైఎస్ విజయలక్ష్మి, షర్మిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది. వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది.
ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో పరకాల పీఎస్లో కేసు నమోదైంది. అక్రమాస్తుల కేసులో అదే రోజు కోర్టుకు సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు.
అక్రమార్కుల కేసులో జగన్ గైర్హాజరుపై సీబీఐ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం కూడా జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. హాజరు నుంచి మళ్లీ మినహాయించాలని జగన్ తరపు లాయర్ కోరారు. పదే పదే మినహాయిపు కోరడంపై సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పటివరకు జగన్కు 10 సార్లు మినహాయింపు ఇచ్చామని కోర్టు తెలిపింది. 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని కోర్టు ఆదేశించింది.