Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిడ్డను హాల్‌లో టీవీ చూడమని చెప్పి... భార్య పడక గదిలో... భర్త పూజగదిలో ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ఏకైక బిడ్డను హాల్‌లో టీవీ చూడమని చెప్పి.. భార్య పడక గదిలో, భర్త పూజ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. తాజ

Advertiesment
Couple commits Suicide
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:32 IST)
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ఏకైక బిడ్డను హాల్‌లో టీవీ చూడమని చెప్పి.. భార్య పడక గదిలో, భర్త పూజ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీపురానికి చెందిన వెంకట సురేశ్‌ (31), తాటిపత్తికి చెందిన భవానీ(24)కి ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకటసురేశ్‌ భార్యతో కలిసి కొంతకాలం సనత్‌నగర్‌లో నివాసమున్నాడు. ఏడాదిన్నర క్రితం రామచంద్రాపురంలోని ఎంఐజీ కాలనీలో 4302 ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కుమారుడు సాయిధీరజ్‌(3)ను తీసుకొని బుధవారం బయటికెళ్లి రాత్రికి తిరిగి ఇంటికి వచ్చారు. 
 
ఆ తర్వాత ఇద్దరూ గొడవపడ్డారు. గురువారం మధ్యాహ్న సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సిబ్బంది వచ్చి తలుపులు తట్టారు. తెరవకపోవడంతో కిటికీ నుంచి చూడగా ఇద్దరూ ఇంటిపైకప్పుకు వేలాడుతూ కనిపించారు. విషయాన్ని ఇంటి యజమానికి చెప్పి వెళ్లిపోయారు. భవానీ బెడ్‌రూమ్‌లో, భర్త పూజగదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలియని కుమారుడు సాయిధీరజ్‌ హాల్‌లోనే ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కటిక నేలపై అన్నం, పప్పు, కూర పడేసి వెళ్లిన వార్డ్ బాయ్.. ఆత్రుతతో ఆరగించిన రోగి... రాంచీ ఆస్పత్రిలో దారుణం