Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైద్యప్రక్రియ - పరీక్షలు - ప్రభుత్వ సదుపాయాలు - విశ్లేషణ

కరోనా వైద్యప్రక్రియ - పరీక్షలు - ప్రభుత్వ సదుపాయాలు - విశ్లేషణ
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (08:50 IST)
కరోనా అని మొదట వారంలో అనుమానంగా ఉంటే మొట్టమొదట ర్యాపిడ్ ఆంటిజెన్ చేసుకోవాలి. అది స్వాబ్ ద్వారా చేస్తారు. ఇందులో 60శాతం పాజిటివ్ వస్తుంది. 15 నిముషాలలో ఫలితం వస్తుంది. వారు పారాసిటమాల్, దగ్గు మందు, విటమిన్ మాత్రలు వాడాలి. ఇంట్లో ఐసోలేషన్ లో ఉండి పల్సాక్సి మీటర్ తో ఆక్సిజన్ శాతం చూసుకుంటూ ఉండాలి.

93శాతం కంటే తగ్గితే 104 ను సంప్రదించి ఆసుపత్రి కి వెళ్ళాలి. ర్యాపిడ్ ఆంటిజెన్ లో నెగిటివ్ వచ్చిన 40శాతం మంది స్వాబ్ ద్వారా చేసే ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి. దీని ఫలితం 1 నుండి మూడు దినాలు పడుతుంది. ప్రభుత్వం లో ఆటోమెటిక్గా మొదటి స్వాబ్తో వారేచేస్తారు.

మళ్ళీ సాంపిల్ అడగరు. 70శాతం నుంచి 82శాతం వరకు పాజిటివ్ వస్తుంది. అంటే 40 లో 32 మందికి తేలిపోతుంది. మొదట 60, ఇందులో 32 అంటే 92శాతం పాజిటివ్ వుంటే తెలిసిపోతుంది. మిగిలిన 8శాతం మంది చెస్ట్ ఎక్స్ రే తీసుకొని ఏమిలేకుంటే, మైల్డ్ గాఉన్నా ఐసోలేషన్లో ఉండాలి.

ఈ రెండు టెస్ట్ లలో తప్పించుకొనేవారు 8శాతం మాత్రమే. వీరందరూ పారాసిటమాల్, దగ్గు మందు, విటమిన్ మాత్రలు వాడాలి. ఇంట్లో ఐసోలేషన్ లో ఉండి పల్సాక్సి మీటర్ తో ఆక్సిజన్ శాతం చూసుకుంటూ ఉండాలి. 93శాతం కంటే తగ్గితే 104 ను సంప్రదించి ఆసుపత్రి కి వెళ్ళాలి.
 
సీటీ స్కాన్ అనేదాని పాత్రలేనే లేదు. మన తెలుగు రాష్ట్రాలలో చేసినంత దోపిడీ ఎక్కడ కూడ లేదు. మొదట చేసినా చిన్న ప్యాచ్లు ఉన్నా దానిని బూచిగా చూపించి లక్షలు దోచుకుంటున్నారు. నీతినియమాలకు తిలోదకాలిచ్చారు. అందరికీ స్కాను తీసి కొరోనా అంటున్నారు. అందరికీ సీవోఆర్ఏడీ 4,5 అంటున్నారు. సీటీ స్కాన్ కు కొందరు 5000 నుండి 10,000 తీసుకుంటున్నారు.

స్వతంత్ర ఆసుపత్రి ఉన్నవారు, ఆర్ఎంపీల ద్వారా వచ్చిన వారికి,ఆర్థికంగా ఉన్నవారికి సీటీ స్కాన్ 3000, ఫిల్ము వద్దంటే 2000 అని అందరికీ ఒకరిపోర్టులో ఇచ్చేస్తున్నారు. ఇక దందా మొదలైపోతుంది. లాడ్జులు తీసుకొని కోవిడ్ సెంటర్ లనే గదులలో పెట్టి, 3-5 లక్షల దోపిడీ కి తెరదీస్తున్నారు.

బిల్లులు కూడా ఇవ్వడంలేదు. 40,000 కార్డులు దానికే బిల్లు గొడవపడితేనే సుమీ. మిగతా దంతా క్యాష్ కక్కాల్సిందే. ఎవరికైనా చెప్పుకోవచ్చు. నీకింత నాకింత. ఒక వేళ ఏమయినా అంటే బౌన్సర్లు తో తొక్కి నారతీయడమే. చాలామంది ఈ గొలుసుకట్టు వ్యాపారంలో ఉంటారు. వారందరూ మీదపడిపోతారు. మూసుకుని పొమ్మంటారు. 
 
90శాతం మందికి ఊరికే ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటే పోయేదానికి, టెస్ట్ ఫలితం లేటయింది, ఏదో కొంపలంటు కున్నట్లు ప్రభుత్వం నెలకు 300 కోట్లు ఖర్చు పెట్టి చేసే దానిని మరిచి, నిందిస్తూ, ఎగేసుకొని, డబ్బు అంతో ఇంతో అప్పుచేసి ఆ సీటీ స్కాన్ దగ్గరకు వెళితే ఆ భామాపాలెస్ బ్యాచ్కు చిక్కి విలవిలలాడాల్సిందే.
 
ప్రభుత్వం చేసే పరీక్షలు రెండూ చేసుకుని 90శాతం బాగుపడుతున్నారు, ఏమి నష్టాలు పోవడంలేదు. ఈ తనకలాడే 8శాతం నెగటివ్ లు మొత్తము అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అందులో చదువుకున్న వారు చాలామంది.
 
సీటీ స్కాన్ అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆసుపత్రి లో కోవిడ్ నిర్దారణ అయి చేరిన వారికి అవసరం అయితేనే చేయాలి. అమెరికాలో కూడా ఇలాగే చేస్తున్నారు, సీటీ స్కాన్ ను కోవిడ్ నిర్ధారణ కు ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలో నూ వాడడంలేదు. అది కార్పోరేట్ మాయాజాలం. క్వారంటైన్ కు వెళ్ళవలసి వస్తుందని భయపడిదొంగ గా దొంగతనం గా వైద్యప్రక్రియ చేయించుకోవాలి అనేవారికోసం కనిపెట్టిన ఎత్తుగడ అంతే..ఇందులో తెలియక పోవడానికి ఏమీలేదు.
 
ఆసుపత్రిలలో ఆరోగ్యశ్రీ ఉందికదా అని వెళితే మొండిచేయిచూపిస్తున్నారు. ఇవే ఆసుపత్రి లు ఇన్నాళ్ళు మధ్యవర్తుల ద్వారా ఎరవేసి ఆరోగ్యశ్రీ పేషెంట్లను పిలుచుకొనేవారు. ఇపుడు ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే తలుపులు వేస్తున్నారు. ఈ బ్యాచ్ ను చాలా మంది సపోర్టుచేస్తారు. చాలామందికి ఆ సీటీ స్కాన్ చూసేదికూడా రాదు. ఆ రిపోర్టు కాగితం చూస్తారు. చట్టవిరుద్ధంగా 20,000 నుంచి 50,000 మందులు రాసి ఇంటికే తమ మెడికల్ షాపులో కొని పంపుతారు.

ఈ విధమయిన సీటీ స్కాన్ ద్వారా ఇచ్చే వైద్యప్రక్రియ చట్టవ్యతిరేకం. దొంగగా వైద్యం చేస్తే దొరికితే శిక్షలు తప్పవు. ఆ భామాప్యాలెస్ కలాపం తప్పు. ఎవరికీ తలవంచని ప్రజలు ఒక్క వైద్యులకే నమస్కరిస్తారు. తప్పనిసరిగా కట్టినా అవకాశము వచ్చీనప్పుడు కంప్లైంట్ లతో విరుచుకు పడతారు. అప్పుడు పారిపోవలసిందే.
 
వీటిని తెలుసుకోండి, జాగ్రత్తగా ప్రభుత్వం సదుపాయాలు వినియోగించుకోండి. ఇంత ఆర్థికంగా కష్ఠమైన పరిస్థితులు ఉన్నా నెలకు 300 కోట్లు పరీక్షలకు, 1000 కోట్లు మౌలికసదుపాయాలకు, మందులకు, రోజురోజుకు 500 రూపాయలు కేవలం భోజనానికే ప్రతి పేషంటుకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

అంతేకాక డిశ్చార్జ్ పేషంట్కు 2000, ప్లాస్మాథిరపీ కి 5000, మృతులకు 15000 ఖర్చుచేస్తుంది. ఊరికే మీ భయంతో చెప్పుడు మాటలువిని ప్రభుత్వం ను నిందిస్తూ నేతిబీరకాయలోని నెయ్యి దొరుకుతుంది అని నమ్మి.దళారుల మాటలు విని లేక భయంతో ప్రైవేటు కు పరిగెత్తి ఇల్లు వళ్ళు గుల్లచేసుకొని ఏడవకండి.

చాలా తెలివయిన వారే మీకేమైంది? ఎండమావులలో నీరెక్కడైనా దొరుకుతుందా? గొర్రె కసాయి వాన్నే ఎందుకు నమ్మాలి. మీరే ఆలోచించుకోవాలి. మీరే తెలివైనవారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్రోను కూడా ప్రైవేటుపరం చేస్తున్నారా? ఛైర్మన్ శివన్ ఏమంటున్నారు?