Publish Date: Wed, 27 Apr 2022 (11:21 IST)
Updated Date: Wed, 27 Apr 2022 (11:23 IST)
పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది రూ.13వేల కోట్లకుపైగా వ్యయం చేయనున్నట్లు చెప్పారు.
భారీగా గృహ నిర్మాణాలతో జిల్లాల ఆర్థిక ప్రగతి, రాష్ట్ర జీఎస్‌డీపీ పెరగడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఉత్పత్తి రంగం సామర్థ్యం పెరిగి ప్రతి జిల్లా జీడీపీ మరోస్థాయికి చేరుకుంటుందన్నారు.
ఆప్షన్ 3 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని, అదే రోజు విశాఖలో 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా ఇస్తామని చెప్పారు. అదేరోజు 1.79 లక్షల పీఎంఏవై -వైఎస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
వీటితోపాటు మొదటి దశ పేదల ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షల గృహాలు, 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 21.24 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు.
సెల్వి
Publish Date: Wed, 27 Apr 2022 (11:21 IST)
Updated Date: Wed, 27 Apr 2022 (11:23 IST)