Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొంత పేపర్.. ఛానెల్ లేకుండానే నంద్యాలలో గెలుపొందాం : చంద్రబాబు

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో సొంత పేపర్, ఛానెల్ లేకుండానే గెలుపొందామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ వర్క్ షాపులో చంద్రబాబు మ

Advertiesment
TDP Workshop In Vijayawada
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:22 IST)
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో సొంత పేపర్, ఛానెల్ లేకుండానే గెలుపొందామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ వర్క్ షాపులో చంద్రబాబు మాట్లాడుతూ, సొంత పేపర్, ఛానెల్ లేకుండానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాం. పేపర్, ఛానెల్ ఉన్న విపక్షం ఘోరంగా విఫలమైంది. గతంలో పార్టీకి దూరమైన వర్గాలు ఈ ఎన్నికల్లో టీడీపీకి దగ్గరవడమే అసలు విజయం. ఓటు బ్యాంకును కాపాడుకుందాం. కొత్త ఓటు బ్యాంకును సాధించుకోవడంతో గెలుపు సాధ్యమైందన్నారు. 
 
కులమతాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు విపక్షం ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు పెద్దపీట వేశారన్నారు. విజయవాడలో ఒక నాయకుడు మరో కులాన్ని రెచ్చగొట్టారని, దీంతో ఆ సామాజిక వర్గం వాళ్లు ధర్నా చేశారని అన్నారు. వైసీపీలో వాళ్లు వాళ్లూ కొట్టుకుని నగరంలో అశాంతిని రేకెత్తించారని చంద్రబాబు విమర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆయన శిల్పా బ్రదర్స్‌పై సెటైర్లు కూడా వేశారు. తాము లేకపోలేదు.. నంద్యాలలో టీడీపీకి పొద్దుగడవదని శిల్పా బ్రదర్స్ అనుకున్నారనీ, వారికి దేవుడు సరైన గుణపాఠం చెప్పారన్నారు. పార్టీలో చేరికలపై టీడీపీ నేతలు విశాల దృక్ఫథంతో ఉండాలి. చేరికలతో పార్టీ బలపడాలి.. మీరూ బలపడాలి. ఎవరూ పార్టీలోకి రాకూడదనే ధోరణి మంచిది కాదని హితవు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా స్వీటీ హనీతో ఒళ్లు మర్దన చేయించుకోవాలి.. పంపించండి ప్లీజ్... గుర్మీత్