Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనితీరులో అగ్రస్థానం.. కానీ ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్‌కు పదో స్థానం.. ఎందుకని?

Advertiesment
Pawan kalyan

ఠాగూర్

, గురువారం, 6 ఫిబ్రవరి 2025 (17:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఫైళ్ల క్రియరెన్స్‌ను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చారు. అయితే, మంత్రుల పనితీరును ప్రామాణికంగా చేసుకుని ర్యాంకులు కేటాయించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రిగా ర్యాంకు దక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆరో స్థానం వచ్చింది. మొదటి స్థానాన్ని మాత్రం రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖామంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ దక్కించుకున్నారు. 
 
ఇకపోతే, విద్య, ఐటీ శాఖామంత్రిగా ఉన్న నారా లోకేశ్‌కు ఎనిమిదో స్థానం రాగా, రెండో స్థానంలో కందుల దుర్గేశ్, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదో స్థానంలో డోలా బాలవీరాంజేనయ స్వామి, ఏడో స్థానంలో సత్యకుమార్, తొమ్మిదో స్థానంలో బీసీ జనార్థన్ రెడ్డి, 11వ స్థానంలో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు 18వ స్థానంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో గుమ్మిడి సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్యప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిలిచారు. మంత్రుల పేషీల్లోకి వచ్చే ఫైళ్ళ క్లియరెన్స్‌ను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)