Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పశు సంపదను పూజించే పవిత్ర కార్యక్రమం కనుమ : సీఎం చంద్రబాబు

Advertiesment
kanuma festival

ఠాగూర్

, బుధవారం, 15 జనవరి 2025 (12:30 IST)
కనుమ పండుగను పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పశు సంపందను పూజించే పవిత్రమైన పండుగ కనుమ అని కొనియాడారు. అలాంటి పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. 
 
'రాష్ట్ర ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అని ట్వీట్ చేశారు.
 
'తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుమ. రైతన్నలు ఏడాది పొడవునా తమ కష్టంలో పాలుపంచుకునే పశువులను పూజించే పండుగ కనుమ. మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడిపంటలతో పచ్చగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబసభ్యులంతా కలిసి గొప్పగా జరుపుకోవాలి. ఈ కనుమ పండుగ మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు' అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త అల్లుడికి 465 వంటకాలతో సంక్రాంతి విందు.. (Video)