2003 అక్టోబరు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడి కేసులో 25వ నిందితుడిగా ఉన్న సాకే క్రిష్ణ అలియాస్ దామోదర్ ను విడుదల చేస్తూ తిరుపతి ఐదవ కోర్టు మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. మావోయిస్టుగా ఉన్న సాకే క్రిష్ణ, సాగర్ తో కలిసి చంద్రబాబుపై బాంబు దాడికి పాల్పడ్డారన్నది అభియోగం.
ఐతే ఈ కేసులో ప్రధానంగా 50 మందికి పైగా నిందితులను పోలీసులు గుర్తించి ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారు. 13 సంవత్సరాలుగా బాంబు దాడి కేసు తిరుపతి కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఐతే ఈరోజు మధ్యాహ్నం ఐదవ మేజిస్ట్రేట్ ముందు 25వ నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఆయన తరపు న్యాయవాది సాకే క్రిష్ణకు దాడికి ఎలాంటి సంబంధం లేనట్లు ఆధారాలు అందించారు. దీంతో కోర్టు సాకే క్రిష్ణను నిరపరాధిగా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.