Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం వద్దన్నదనీ... చెల్లి భర్త ఏం చేశాడో తెలుసా?

భర్తను కోల్పోయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చేతులు, కాళ్లు నరికి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా మిస్సింగ్ కేసు పెట్టి

Advertiesment
Chittoor
, సోమవారం, 26 జూన్ 2017 (14:20 IST)
భర్తను కోల్పోయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చేతులు, కాళ్లు నరికి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా మిస్సింగ్ కేసు పెట్టి పోలీసులకు బుక్కయ్యాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని పూతలపట్టు మండలం గొడుగుచింతకు చెందిన మంజుల(40) అనే మహిళకు కొన్నేళ్ళ కిందట భర్తను కోల్పోయింది. దీంతో ఆమె తన చెల్లెలి భర్త చంద్రశేఖర్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో మంజుల పిల్లలు పెరిగి పెద్దవాయ్యారు. దీంతో వివాహేతర సంబంధం వద్దని వారించగా, చంద్రశేఖర్ రెడ్డి నిరాకరించారు. ఇదే అంశంపై వారిద్దరి మధ్య గత కొంతకాలంగా ఘర్షణ జరుగుతోంది కూడా. 
 
ఈ క్రమంలో ఈ నెల 21న చిత్తూరు సంతపేటలోని తన అక్క సుబ్బరత్నమ్మ ఇంటికి మంజుల వచ్చింది. అదేరోజు సాయంత్రం చంద్రశేఖర్‌ రెడ్డితో కలసి ఆటోలో గొడుగుచింతకు బయలుదేరింది. మార్గమధ్యంలో వివాహేతర సంబంధం విషయమై వారిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. 
 
దీంతో ఆగ్రహానికి గురైన చంద్రశేఖర్ రెడ్డి.. ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహతప్పి కిందపడిపోయింది. అనంతరం మంజులను పట్నం పెద్ద చెరువులో పడేశాడు. అయితే చనిపోయిందో.. లేదోనన్న అనుమానంతో కత్తితో మంజులను ఇష్టారాజ్యంగా నరికి, ఆమె చేతులను పూతలపట్టు సమీపంలోని వేము కళాశాల వద్ద పడేసి వెళ్లాడు.
 
రెండు రోజుల తర్వాత అంటే 23న చంద్రశేఖర్ రెడ్డే స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులకు అనుమానం వచ్చి చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం మంజుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు