Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి చాలా మంచోడు... 'నువ్వొద్దురా పో' అంటే కార్గో వ్యాపారం చేస్కుంటా... నాని

రాజకీయ నాయకుల్లో... అదికూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఈమధ్య తాము ఏమనుకుంటున్నారో అనే విషయాలను పార్టీ వేదిక పైన కాకుండా మీడియాతో మాట్లేడుస్తున్నారు. దీనితో తెదేపాకు తలనొప్పులు వస్తున్నాయనే భావనలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా

Advertiesment
Chiranjeevim nice person
, సోమవారం, 26 జూన్ 2017 (12:49 IST)
రాజకీయ నాయకుల్లో... అదికూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఈమధ్య తాము ఏమనుకుంటున్నారో అనే విషయాలను పార్టీ వేదిక పైన కాకుండా మీడియాతో మాట్లేడుస్తున్నారు. దీనితో తెదేపాకు తలనొప్పులు వస్తున్నాయనే భావనలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను ఎక్కడైనా చెప్పేయవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలపై పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదనేది మీడియాలో మాట్లాడేవారి వాదన.
 
ఇదిలావుంటే తాజాగా కేశినేని నాని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు, మెగాస్టార్ చిరంజీవి చాలా మంచివాడంటూ ఆయనపై పొగడ్తల జల్లు కురిపించారు. ప్రజారాజ్యం పార్టీలో తను 3 నెలల పాటు కొనసాగాననీ, ఐతే ఆ సమయంలో పార్టీని నడపలేకపోతున్న చిరంజీవిని చూశాక బయటకు వచ్చేశానన్నారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను పిలిచి పార్టీ టిక్కెట్ ఇచ్చారనీ, ఇప్పుడు వద్దు పోరా అని చెబితే నేరుగా వెళ్లి కార్గో వ్యాపారం చేసుకుంటానని వ్యాఖ్యానించారు. అంతేతప్ప ఏ రాజకీయ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత తనే సీఎం అని అనుకుంటున్నారనీ, కానీ ఆయన్ను ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదని జోస్యం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామీ.. నోరు అదుపులో పెట్టుకో... చెన్నై హిజ్రాలను మళ్లిస్తాం : రజనీ ఫ్యాన్స్ వార్నింగ్